: గుంటూరులో విషాదం.. ప్రేమించిన అమ్మాయిని కాదని వేరే యువతితో పెళ్లి.. వరుడి ఆత్మహత్య
గుంటూరులో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని కాదని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న వెంకటేశ్ అనే యువకుడు వివాహం జరిగిన వారం రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. అక్కడి ఈవూరు ప్రాంతానికి చెందిన వెంకటేశ్ పెళ్లికి ముందు ఓ యువతిని ప్రేమించాడు. అయితే పలు కారణాలతో ప్రేమించిన యువతిని కాదని, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన రెండు, మూడు రోజుల తరువాత వెంకటేశ్ తాను ప్రేమించిన ప్రియురాలి బంధువులతో గొడవ పడినట్లు తెలుస్తోంది. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే ఎందుకు ప్రేమించావంటూ వెంకటేశ్ ని నిలదీసి, మళ్లీ పెళ్లి చేసుకోవాలని అతని ప్రియురాలి బంధువులు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో వెంకటేశ్ తన ఇంట్లో ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంకటేశ్ రూమ్‌లో పడి ఉండడం గమనించిన అతని కుటుంబ సభ్యులు అతనిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకటేశ్ మరణించాడు.