: అమ్మాయిల అభినందనలే ఎక్కువగా వస్తున్నాయి: హీరో సుధీర్ బాబు
అమ్మాయిల అభినందనలే తనకు ఎక్కువగా వస్తున్నాయని ఇటీవల విడుదలైన హిందీ చిత్రం ‘బాఘీ’లో విలన్ పాత్ర పోషించిన తెలుగు హీరో సుధీర్ బాబు అన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘బాఘీ’ చూసిన తర్వాత ఎక్కువ మంది అమ్మాయిలే తనను అభినందిస్తూ మెసేజ్ లు చేస్తున్నారన్నాడు. ఈ చిత్రంలో తన పాత్ర బాగుందంటూ ప్రముఖ నటుడు శక్తికపూర్ తనకు ఫోన్ చేసి చెప్పారన్నారు. బాలీవుడ్ లో తనకు మంచి అవకాశాలొస్తున్నాయన్నారు. ఏ చిత్రం పడితే అది ఒప్పుకోకుండా, సెలెక్టెడ్ చిత్రాలను ఎంచుకుంటానని, హిందీ చిత్రాల్లో హీరోగానే నటించాలనే నిబంధనలేవీ తనకు లేవని, ప్రాధాన్యం ఉన్న ఏ పాత్రలో నైనా నటిస్తానని సుధీర్ బాబు చెప్పాడు.