: వెంకన్నకు భువనేశ్వర్ భక్తుడి భూరి విరాళం!
తిరుమల వెంకన్నకు భూరి విరాళాలు పోటెత్తుతున్నాయి. ఇప్పటికే టన్నుల కొద్దీ విరాళాల రూపేణా వేంకటేశుడికి వచ్చిన బంగారం భద్రంగా బ్యాంకులకు చేరింది. తాజాగా ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు చెందిన ఓ భక్తుడు తన ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామికి రూ.1.5 కోట్ల విలువ చేసే బంగారంతో చేయించిన రెండు సాలిగ్రామ హారాలను కానుకగా సమర్పించారు. ఈ మేరకు నిన్న రాత్రే తిరుమల చేరుకున్న సదరు భక్తుడు కొద్దిసేపటి క్రితం స్వామివారిని దర్శించుకుని... తన వెంట తెచ్చిన సదరు సాలిగ్రామ హారాలను టీటీడీ ఈఓ సాంబశివరావుకు అందజేశారు.