: మైనర్లకు ఫేస్‌బుక్‌ అకౌంట్లు చట్టవిరుద్ధమంటూ పిటిషన్‌


18ఏళ్లు నిండని, మైనర్‌ పిల్లలకు ఫేస్‌బుక్‌ అకౌంట్లు ఇవ్వడం అనేది చట్ట విరుద్ధం అంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. ఈ విషయంపై మైనర్లకు అకౌంట్లు ఇవ్వడాన్ని ఎలా అనుమతిస్తున్నారో వివరించాలంటూ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

మాజీ భాజపా నాయకుడు కె.ఎన్‌.గోవిందాచార్య ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. తమ వినియోగదారుల వివరాలు తెలుసుకోకుండానే ఖాతాలు ఇచ్చేస్తున్న ఫేస్‌బుక్‌, గూగుల్‌ సైట్‌లను ఆయన తప్పుపట్టారు. దీనిపై పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఆయా వెబ్‌సైట్లకు కూడా నోటీసులు ఇచ్చారు.

ఈ విషయంలో పిటిషనర్‌ న్యాయవాది విరాగ్‌ గుప్తా మాట్లాడుతూ.. ఈ వెబ్‌సైట్లకు ఉన్న ఖాతాల్లో దాదాపు 8 కోట్లకు పైగా నకిలీ గుర్తింపుతో పొందిన ఖాతాలేనని ఆరోపించారు.

  • Loading...

More Telugu News