: తెలంగాణలో వైసీపీకి నేడే ఆఖరి రోజు!... కేసీఆర్ సమక్షంలో కారెక్కనున్న పొంగులేటి, పాయం


ఏపీలో విపక్ష పార్టీ హోదా సాధించిన కొత్త పార్టీ వైసీపీ తెలంగాణలో ఇక కనిపించదు. ఆ పార్టీ పేరు తెలంగాణ గడ్డపై వినిపించదు. నేడు ఆ పార్టీకి తెలంగాణలో చివరి రోజే. ఆ పార్టీ ప్రతినిధులుగా ఉన్న ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నేడు ఆ పార్టీకి వీడ్కోలు పలకనున్నారు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు వీరిద్దరూ హైదరాబాదులో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమక్షంలో గులాబీ దళంలో చేరనున్నారు. వీరిద్దరి పార్టీ మార్పుతో తెలంగాణలో వైసీపీకి ప్రజా ప్రతినిధులంటూ ఇక ఎవరూ మిగలరు. దీంతో ఆ పార్టీ తెలంగాణ నుంచి దాదాపుగా కనుమరుగైనట్టే.

  • Loading...

More Telugu News