: హైదరాబాదులో అతిపెద్ద జాతీయ పతాకం ఏర్పాటుకు కేసీఆర్ ఆదేశం

హైదరాబాద్ లో అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. బతుకమ్మ ఘాట్ వద్ద పతాకం ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. 301 అడుగులు ఎత్తులో పతాకం ఉండేలా చూడాలని, రాంచీలోని 293 అడుగుల పతాకం కంటే ఎక్కువ ఎత్తులో జెండా ఎగురవేయాలన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, పౌరుల్లో జాతీయ భావనను పెంపొందించేందుకు ఈ చర్య దోహదం చేస్తుందన్నారు.