: వ్యవసాయ బావిలో పడిపోయిన చిరుత..మత్తు ఇంజక్షన్ ఇచ్చి బయటకు తీసిన రెస్క్యూ టీమ్


చిరుతపులి వ్యవసాయ బావిలో పడిన ఉదంతం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేటలో ఈరోజు చోటుచేసుకుంది. ఆ గ్రామస్తుడు ఒకరు బావి వద్ద నిలబడి ఉన్న సమయంలో చిరుత అరుపులు వినిపించాయి. దీంతో, బావిలోకి తొంగిచూసిన అతనికి అసలు విషయం తెలిసింది. ఈ సమాచారాన్ని పోలీసులకు, అటవీ శాఖాధికారులకు తెలియజేశారు. సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుమితారావు అక్కడికి వెళ్లారు. ఈ విషయాన్ని వరంగల్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోని రెస్క్యూ టీంకు తెలియజేశారు. క్రేన్ ను ఉపయోగించి బోనును బావిలోకి దింపారు. అయితే, బోనులోకి చిరుత రాకపోవడంతో మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎట్టకేలకు దానిని బయటకు తీసుకువచ్చారు. చిరుతను చూసేందుకు గ్రామస్తులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

  • Loading...

More Telugu News