: తెలంగాణ ప్రజలు సంబరపడుతుంటే చంద్రబాబుకు కళ్లమంట: మంత్రి హరీష్ రావు


కాళేశ్వరం ప్రాజెక్ట్ కు భూమి పూజ చేసుకుని తెలంగాణ ప్రజలు సంబరపడుతుంటే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కళ్లమంటతో వ్యవహరిస్తున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. శుభకార్యం జరుగుతుంటే ముక్కులో పుల్ల పెట్టుకుని తుమ్మినట్టుగా ఏపీ కేబినెట్ తీరు ఉందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ ఏపీ కేబినెట్ చేసిన తీర్మానం చెల్లని రూపాయి వంటిదన్నారు. ఆ తీర్మానానికి విలువలేదు కనుకనే కోర్టుకు పోతామంటున్నారని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ కోసం తాము ఉద్యమించిన సమయంలో కూడా ఆంధ్రా నాయకులు తప్పుడు లెక్కలు చెప్పారని, అదే బుద్ధి ఇప్పుడు కూడా చూపిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టి తీరుతామని, దగ్గరుండి మరీ వాటిని పూర్తి చేయిస్తానని హరీశ్ రావు అన్నారు.

  • Loading...

More Telugu News