: ఈ సందర్భంగా ఆమెను ఇలా చూడడం బాధగా ఉంది: కంగనా తండ్రి


2015లో 'తను వెడ్స్ మను' సినిమాలో నటించినందుకుగాను జాతీయ ఉత్తమ నటిగా నిలిచిన కంగనా రనౌత్ ప్రస్తుత పరిస్థితిపై ఆమె తండ్రి అమర్ దీప్ రనౌత్ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ ఉత్తమ నటిగా సంబరాలు చేసుకోవాల్సిన తరుణంలో ఆమె సక్సెస్ ను జీర్ణించుకోలేని కొందరు వివాదాలు, ఆరోపణలతో ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను చూడడం తండ్రిగా బాధిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కంగనా రనౌత్ మాజీ ప్రియుడు అధ్యాయన్ సుమన్ మాత్రం ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆమెకు క్షుద్ర పూజలు తెలుసని అన్నాడు. చేతబడి లాంటి క్షుద్ర పూజలను కంగనా రనౌత్ ఔపోసన పట్టిందని అధ్యాయన్ ఆరోపించాడు.

  • Loading...

More Telugu News