: అంచనాలు లేకుండా రాణిస్తున్న జట్టుతో.. అంచనాలకు మించి రాణిస్తున్న జట్టు 'ఢీ'


ఐపీఎల్ సీజన్ 9లో ఎలాంటి అంచనాలు లేకుండా దూసుకెళ్తున్న గుజరాత్ లయన్స్ జట్టుతో అంచనాలకు మించి రాణిస్తున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు రాజ్ కోట్ లో తలపడుతోంది. ఈ సీజన్ లో ఇది 31వ మ్యాచ్ కాగా, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో రైనా సేన బ్యాటింగ్ ప్రారంభించింది. రైనా నాయకత్వంలో గుజరాత్ లయన్స్ జట్టు స్పూర్తిమంతమైన విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ జట్టుగా నిలిచింది. ఇదే సమయంలో బౌలింగ్ లో బలంగా ఉన్న ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు టాప్ జట్లను మట్టికరిపించి టాప్ 3లో నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు నైతిక స్థైర్యంతో పాటు, పాయింట్ల పట్టికలో మరింత ముందుకు ఎగబాకుతోంది. కాగా, దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన గుజరాత్ లయన్స్ జట్టుకు షాక్ నిస్తూ మెక్ కల్లమ్ (1)ను పెవిలియన్ కు పంపి తన తొలి ఓవర్లో జహీర్ ఖాన్ బ్రేక్ ఇవ్వగా, దానిని కొనసాగిస్తూ తరువాతి ఒవర్ లో స్మిత్ (15), ఫించ్ (5) లను పెవిలియన్ బాటపట్టించి నదీమ్ ఆకట్టుకున్నాడు. దీంతో గుజరాత్ నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. క్రీజులో రైనా (1)కు దినేష్ కార్తిక్ జత కలిశాడు.

  • Loading...

More Telugu News