: నీతిగల ఎమ్మెల్యేగా ఉన్నాను...మీతో వస్తే చరిత్ర హీనుడిగా మిగిలిపోతానని చెప్పాను: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి


జగన్ నాయకత్వంలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా నీతి గల ఎమ్మెల్యేగా ఇప్పటి వరకు ప్రజల్లో ఉన్నానని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన సేవ్ డెమోక్రసీ సంఘీభావ సభలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ ప్రలోభాలకు తలొగ్గి పార్టీ మారితే చరిత్ర హీనుడిగా మిగిలిపోతానని, పార్టీ మారాలంటూ తనను సంప్రదించిన టీడీపీ నేతలకు సూచించానని అన్నారు. అనంతరం ఎంపరర్ ఆఫ్ కరెప్షన్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. చంద్రబాబు కుంభకోణాలకు ఈ పుస్తకం అక్షర రూపమని ఆయన చెప్పారు. తాము చెప్పిందే వేదం, చేసేదే అభివృద్ధి అని టీడీపీ మూర్ఖంగా ముందుకు వెళ్తే...వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన చెప్పారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లోపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం రాజకీయ వ్యభిచారమేనని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News