: రాష్ట్రం విడిపోయినప్పటికీ తెలంగాణపై కక్ష కట్టిన చంద్రబాబు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
రాష్ట్రం విడిపోయినప్పటికీ తెలంగాణపై చంద్రబాబు కక్ష కట్టారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. ఏపీని పరిపాలించడం చేతకాక తెలంగాణ ప్రాజెక్టులపై బాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులపై అవగాహన లేని కాంగ్రెస్ నాయకురాలు డి.కె అరుణ, టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిలు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని బాలరాజు విమర్శించారు.