: కాశీలో కాకినాడ వాసులపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి... కొందరు అదృశ్యం!


కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకునేందుకని వెళ్లిన తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఏడుగురు యాత్రికులు అదృశ్యమయ్యారు. గత నెల 29వ తేదీన కాకినాడ గొల్లపేటకు చెందిన అప్పారావు(80), పేరంటాలు(70), నారాయణమ్మ (60), లక్ష్మి (50), మాణిక్యం (50), మంగమ్మ (55), అప్పల నర్సమ్మ (48), లోవరాజు (28) కాశీ బయలుదేరి వెళ్లారు. లోవరాజు తప్ప మిగతావారందరూ కనిపించకుండా పోయారు. లోవరాజు మాట్లాడుతూ, తమపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తీవ్రంగా గాయపడ్డ లోవరాజు వారణాసి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఈ సంఘటనపై బాధితుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ కు వారు ఫిర్యాదు చేశారు. వారణాసిలోని పోలీసు ఉన్నతాధికారులతో ఆయన ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News