: వామ్మో...ఆమె దొంగతనం తీరు చూస్తే షాక్ తినాల్సిందే!


షాపింగ్ మాల్స్ లో సిబ్బంది కళ్లుగప్పి వస్తువులను దొంగతనం చేసినా, సీసీ కెమెరా కంటికి మాత్రం ఎవరైనా సరే చిక్కిపోతారు. తాజాగా ఢిల్లీలోని ఓ సూపర్ మార్కెట్ లో ఓ మహిళ చేసిన దొంగతనం చూసి ఎవరైనా షాక్ తినాల్సిందే. పెద్దగా జనాలు లేని ఓ సూపర్ మార్కెట్ లోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించారు. వారిలో ఓ మహిళ సిబ్బంది ఎవరూ లేరని నిర్ధారించుకుని, స్కర్టు కింద బీరు క్యాన్స్ కేస్ ను (24 బీరు క్యాన్లు) దాచి పెట్టి, ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి చల్లగా జారుకుంది. ఈ తతంగం మొత్తం సీసీ కెమెరా నిక్షిప్తం చేయడంతో ఈ పుటేజ్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News