: మన దేశంలో ఒకేఒక్క మహిళా 'టన్నెల్ ఇంజనీర్' అన్నీరాయ్!
అన్నీ రాయ్... మన దేశంలో ఉన్న ఒకే ఒక్క మహిళా టన్నెల్ ఇంజనీర్ ఈమె. ఢిల్లీ మెట్రో వర్క్స్ లో టన్నెల్ ఇంజనీర్ గా ఆమె విధులు నిర్వహిస్తోంది. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి అండర్ గ్రౌండ్ మెట్రో ఉన్న బెంగళూరులో ఆమె బాధ్యతలు నిర్వహిస్తోంది. టన్నెల్ లోని బోర్ మెషీన్ వద్ద పనిచేస్తున్న ఒకే ఒక్క మహిళగా ఆమె తన ప్రత్యేకత చాటుకుంది. టన్నెల్ లకు సంబంధించిన పనులంటేనే అక్కడి వాతావరణం మహిళలకు అనుకూలంగా ఉండదు. కనీసం అక్కడ టాయిలెట్లు కూడా అందుబాటులో ఉండవు. ఇటువంటి పరిస్థితులుండే చోట ఆమె పనిచేస్తోందా? అంటూ ఆశ్చర్యపోయేవారూ లేకపోలేదు.