: చంద్ర‌బాబు స‌హా ఏపీ మంత్రుల ఇళ్లకు విద్యుత్, నీరు, పారిశుద్ధ్య సేవలు నిలిపేయాలి: ఓయూ విద్యార్థి సంఘం


తెలంగాణ ప్ర‌భుత్వం అక్ర‌మంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తోంద‌ని ఆంధ్రప్ర‌దేశ్ నేత‌లు ఆరోపిస్తూ చేస్తోన్న వ్యాఖ్యల ప‌ట్ల‌ హైదరాబాదు, ఉస్మానియా యూనివ‌ర్సిటీ విద్యార్థి సంఘాల నేత‌లు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. హైదరాబాదులోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఇంటికి స‌హా ఆ రాష్ట్ర మంత్రులంద‌రి ఇళ్లకు నీరు, విద్యుత్, పారిశుద్ధ్య సేవ‌లు ఆపేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ నేత‌లు తెలంగాణ ప్ర‌భుత్వం కోసం నిర్మిస్తోన్న ప్రాజెక్టుల‌కు అడ్డుత‌గ‌ల‌వ‌ద్ద‌ని విద్యార్థి సంఘ నేతలు కోరుతున్నారు. ప్రాజెక్టులపై అన‌వ‌స‌ర విమ‌ర్శ‌లు మానుకోవాల‌ని సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News