: జయపాలనతో తమిళనాడు ప్రజలు విసుగు చెందారు.. మార్పు కోరుకుంటున్నారు: కుష్బూ
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పాలనతో రాష్ట్ర ప్రజలు విసుగు చెందారని కాంగ్రెస్ ప్రచార కర్త, సినీ నటి కుష్బూ అన్నారు. తమిళనాడు ప్రజలు మార్పును కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె.. జయలలితపై మండిపడ్డారు. గతంలో మధురవాయల్ లో వరద బాధితులను ఆదుకోవడంలో జయప్రభుత్వం విఫలమైందన్నారు. ‘ప్రజల కోసమే నేను’ అని చెప్పుకునే జయలలిత కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాజేశారంటూ కుష్బూ ఆరోపించారు. జయలలిత తన ఆస్తులను అమ్మేసి ప్రజల బాధలు తీర్చాలని ఆమె సలహా ఇచ్చారు. ప్రజల కష్టాలను గురించి జయలలిత ఎందుకు తెలుసుకోవడం లేదంటూ ప్రశ్నించారు.