: పాకిస్థాన్ లోని హిందూ దేవాలయాలను కూల్చబోము: హఫీజ్ సయీద్ ప్రకటన


పాకిస్థాన్ లోని హిందూ దేవాలయాలను కూల్చబోమని నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా (జేడీయూ) చీఫ్ హఫీజ్ సయీద్ స్పష్టం చేశాడు. పాకిస్థాన్ లోని సింధ్ ప్రాంతంలోని మట్లి పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, హిందూ దేవాలయాలు, ఇతర పవిత్ర స్థలాల కూల్చివేతను సహించబోమని అన్నాడు. ఈ స్థలాలను పరిరక్షించడం ముస్లిములు, ప్రభుత్వ భాధ్యత అని ఆయన స్పష్టం చేశాడు. భారత సరిహద్దుల్లోని సింధ్ రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహించడం ద్వారా తమ సంస్థ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందన్న ఆరోపణలను ఆయన కొట్టివేశాడు.

  • Loading...

More Telugu News