: ఆ వివాదం వాళ్ల వ్యక్తిగతం...త్వరలో సమసిపోతుంది: బాలీవుడ్ నటులు


బాలీవుడ్ లో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా వారి మధ్య వచ్చే కామన్ టాపిక్ ఏంటంటే, హృతిక్ రోషన్-కంగనా రనౌత్ వివాదం. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సిద్ధార్థ్ మల్హోత్రాలను ఈ వివాదంపై మీడియా ప్రశ్నలు సంధించింది. దీనికి సిద్దార్థ్ మల్హోత్రా సమాధానమిస్తూ ఆ వివాదం వారిద్దరి వ్యక్తిగతమని స్పష్టం చేశాడు. దానిపై మాట్లాడడం ఇతరులకు సరికాదని, దానిపై ఏదైనా మాట్లాడే హక్కు వారిద్దరికే ఉందని చెప్పాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ, ఈ వివాదం త్వరలోనే సమసిపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. వారిద్దరూ సమస్యను పరిష్కరించుకుంటారని చెప్పింది. వివాదం కారణంగా వారి మానసిక పరిస్థితిని తాను అర్ధం చేసుకోగలనని చెప్పిన జాక్వెలిన్, దీనిని అధిగమించి వారిద్దరూ సరైన పంథాలో వెళ్తారని ఆశిస్తున్నానని పేర్కొంది.

  • Loading...

More Telugu News