: పట్టిసీమకు సీడబ్ల్యూసీ అనుమతి ఉందా?: ఏపీకి తలసాని ప్రశ్న
తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులపై ఏపీ కేబినెట్ తీర్మానం చేయడం బాధ్యతారాహిత్య చర్య అని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు ఉన్నాయా? అని ఆయన నిలదీశారు. ఈ విషయంలో ప్రజల్లో జగన్ కు మైలేజీ వస్తుందన్న ఉద్దేశంతోనే, ఏపీ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని ఆయన విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.