: నేను 'సేఫ్' అని భార్య ఎప్పుడు ఫీలవుతుందో తెలుసా?
భార్యాభర్తల అనుబంధానికి ప్రపంచంలోని ఏ బంధమూ సాటి రాదు. మిగిలిన బంధాలన్నీ రక్తసంబంధాలైతే మూడుముళ్లతో ఏర్పడి, ఒకరికి ఒకరుగా జీవితాంతం నిలిచే ఏకైక బంధం భార్యాభర్తల బంధం. అలాంటి దాంపత్యంలో భర్తపై భార్యకు పూర్తి భరోసా ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? నిద్రపోతున్నప్పుడు. అవును, నిజమే భార్యను విహారానికి తీసుకెళ్లక్కర్లేదు. ఖరీదైన బహుమతులు కొనివ్వక్కర్లేదు. కానీ పడుకునేటప్పుడు దగ్గరకి తీసుకుని, ఆమెపై చేయ్యి వేసి నిద్రపోండి చాలు. 'నా భర్త నా వాడే...నేను పూర్తి భరోసాగా ఉండవచ్చు' అనే భావం ఆమెలో కలుగుతుంది. ఎలాంటి చింతా లేకుండా ప్రశాంతంగా నిద్రపోతుంది. రోజంతా పడ్డ కష్టాన్ని భర్త అలా ప్రేమగా తనపై చేయివేసి నిద్రపోవడం ద్వారా ఆమె మర్చిపోతుందని తాజాగా చేసిన ఓ సర్వే బయటపెట్టింది. ఇలా నిద్రపోతున్న దంపతుల మధ్య కలహాలు లేవని వారు చెబుతున్నారు. అలా నిద్రపోని దంపతుల మధ్య విభేదాలు ఉన్నాయని సర్వే వెల్లడించింది. చీటికీ మాటికీ పోట్లాడుకోకున్నా...నాకు ఇది కావాలి, అది కావాలి అంటూ గొంతెమ్మకోరికలు కోరడం, 'ఎప్పుడూ ఇంట్లో ఉండడమేనా? విహారయాత్రలకు వెళ్దాం' అంటూ పోరుతుంటారని సదరు సర్వే పేర్కొంది. మరి, ఇప్పుడర్థమైందా, భార్యను ఎలా ప్రసన్నం చేసుకోవాలో?