: 'నీట్'పై విచారణను ఈనెల ఐదో తేదీకి వాయిదా వేసిన సుప్రీం
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) ద్వారానే వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నుంచి తమ రాష్ట్రాలను మినహాయించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోరిన నేపథ్యంలో ఈరోజు న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈరోజు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వాదనలు విన్న సుప్రీంకోర్టు నీట్ పై విచారణను గురువారానికి ఈనెల (5) వాయిదా వేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వాదనలు గురువారం విననుంది. ఈ అంశంపై ఎంసీఐ, కేంద్ర ఆరోగ్య శాఖల అభిప్రాయాన్ని తెలపాలని సుప్రీంకోర్టు కోరింది.