: ఈ ఏడాది నష్టాలు కాదు.. లాభాలొచ్చాయి: పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు


న‌ష్టాలు త‌ప్ప లాభాలు తెలియ‌ని విమానయాన రంగంలో ఎయిర్ ఇండియా ఈ ఏడాది లాభాల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని ఈరోజు పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు రాజ్య‌స‌భ‌లో వెల్ల‌డించారు. ఎయిర్ క్యారేజ్ బిల్లుపై స‌భ‌లో ఆయన మాట్లాడుతూ ఈ విష‌యాన్ని తెలిపారు. ఎయిర్ ఇండియా నిర్వ‌హ‌ణా లాభాన్ని అర్జించిందని ఆయ‌న చెప్ప‌గానే స‌భ్యులంద‌రూ హ‌ర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఎయిర్ ఇండియా నిర్వ‌హ‌ణా న‌ష్టాల‌ను చూడ‌లేద‌ని ఆయ‌న స‌భ‌లో తెలిపారు. అంతేకాక లాభాన్ని ఆర్జించింద‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News