: నటి పూజితను నేను పెళ్లి చేసుకోలేదు: విజయ్ గోపాల్
విజయ్ గోపాల్ అనే వ్యక్తే తన భర్త అనే విషయాన్ని తెలుపుతూ హైదరాబాద్ పోలీసులకి ఆధారాలు అందించినట్లు తెలుగు సినీ, బుల్లితెర నటి కొద్ది సేపటి క్రితం మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే. తన భర్తపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, తనకు అతని నుంచి ప్రాణహాని కూడా ఉందని పూజిత ఈ సందర్భంగా మీడియాకు వివరించింది. అయితే, పూజితను తాను అసలు పెళ్లి చేసుకోలేదని విజయ్ గోపాల్ చెబుతున్నాడు. ‘ఆమెతో సుమారు పన్నెండేళ్లపాటు సహజీవనం చేశా, గత ఏడేళ్ల నుంచి పూజితకు దూరంగా నివసిస్తున్నా, మా ఇరువురికి ఒక కొడుకు కూడా ఉన్నాడు’ అని చెప్పాడు. తనపై ఆరోపణలకు దిగిన పూజిత ఉద్దేశం ఏంటో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నాడు. పూజిత తన నుంచి ఏం కోరుకుంటుందో తెలియట్లేదని అన్నాడు. పూజిత వెనక ఎవరో ఉన్నారని, వారి మాటలు వినే పూజిత తనపై ఆరోపణలు చేస్తోందని చెప్పాడు.