: ఆస్ట్రేలియాలో అరుదైన వజ్రం లభ్యం


ఆస్ట్రేలియాలోని అర్గైల్ గనిలో అరుదైన వజ్రం లభించింది. ఊదా రంగు వజ్రాల్లో ఇటువంటి వజ్రం చాలా అరుదుగా ఉంటుందని రియో టింటో డైమండ్స్ కంపెనీ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ అరుదైన వజ్రాన్ని 2015 ఆగస్టులో గుర్తించినట్లు చెప్పారు. గనిలో లభ్యమైనప్పుడు సుమారుగా 9.17 కారట్స్ బరువున్న ఈ వజ్రంపై గీతలు, చిన్న చిన్న గుంటలు ఉన్నాయన్నారు. ఆ తర్వాత దానిని చక్కగా మెరుగుపెట్టామని చెప్పారు. అయితే, దీని విలువ ఎంత అన్నది చెప్పలేదు. అరుదైన ఈ వజ్రం ధర 2.5 నుంచి 5 మిలియన్ డాలర్ల వరకు పలకవచ్చని వజ్రాల నిపుణులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News