: మహిళా ఉద్యోగినుల పట్ల 'టాటా' ఉదారత!
తమ సంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల పట్ల టాటా సన్స్ ఉదార నిర్ణయం తీసుకుంది. ఉద్యోగినులు గర్భం దాల్చినప్పుడు వారు కోరుకున్న సమయంలో ఏడు నెలల వేతనంతో కూడిన సెలవును ఇవ్వాలని నిర్ణయించింది. ఆపై కూడా ఏడాదిన్నర పాటు రోజుకు సగం పనిదినం సౌకర్యాన్ని కల్పించనున్నామని తెలిపింది. వారు కోరుకున్న సమయంలోనే వచ్చి పనిచేయవచ్చని తెలిపింది. గ్రూపు సంస్థల్లో ఐదేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగినులకు, వారు పిల్లల సంరక్షణ దిశగా మరింత సెలవును కోరుకుంటే, ఒక సంవత్సరం పాటు అదనపు సెలవును ఇస్తూ, ఆ సమయంలో సగం వేతనాన్ని అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు టాటా గ్రూప్ పాలసీలను మార్చినట్టు టాటా సన్స్ హ్యూమన్ రిసోర్స్ విభాగం చీఫ్ ఎన్ఎస్ రాజన్ వెల్లడించారు. ఈ మార్పులు మే నుంచి అమల్లోకి వచ్చినట్టని ప్రకటించారు.