: నిజానిజాలు తెలుసుకోవాలి.. నాకు బాధగా ఉంది: మీడియాపై మండిపడ్డ విజయ్‌మాల్యా
భారత్‌లో బ్యాంకులను మోసం చేసి విదేశాల్లో తలదాచుకుంటోన్న వ్యాపార వేత్త విజయ్ మాల్యా ట్విట్టర్ వేదికగా మీడియాపై మండిపడ్డాడు. నిజానిజాలు తెలుసుకొని వార్తలు ప్రసారం చేయాలంటూ సూచించాడు. తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నాడు. బ్యాంకులను మోసం చేసి పారిపోయాడని తనపై ఆరోపణలు చేసేముందు నిజం ఏంటో తెలుసుకోవాలని మీడియాకు తెలుపుతున్నట్లు ట్వీట్ చేశాడు. తాను బ్యాంకులకు అప్పు ఎగ్గొట్టొన వ్యక్తిని ఎలా అవుతానని ప్రశ్నించాడు. మెల్లగా అప్పు తీర్చాలని ప్రయత్నిస్తుంటే, ఎగవేతదారుడిగా తనను పేర్కొంటుండడం బాధ కలిగిస్తోందని పేర్కొన్నాడు.