: భూకంపాలు వస్తే ఎలా కడతావ్!... కేసీఆర్ పై ముద్దుకృష్ణమ ఫైర్!
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఏపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఫైరయ్యారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో భాగంగా ఆయన కేసీఆర్ పై సెటైరిక్ విమర్శలు సంధించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమిపూజ సందర్భంగా నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గాలి ప్రస్తావించారు. ‘‘భూకంపాలు వస్తే ప్రాజెక్టులు ఎలా కడతావ్. పిడుగులు పడినా కడతానంటున్నారే... అది మీకు మాత్రమే సాధ్యమా?’’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగువన ఉన్న తెలంగాణ ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కట్టేస్తే రాయలసీమకు నీళ్లెలా వస్తాయని ఆయన ప్రశ్నించారు.