: 27 నుంచి టీడీపీ ‘మూడు రోజుల పండుగ’... తిరుపతిని వేదికగా ఖరారు చేసిన పోలిట్ బ్యూరో


ఈ ఏడాది టీడీపీ ‘మూడు రోజుల పండుగ’ మహానాడు... తిరుమల వెంకన్న పాదాల చెంత తిరుపతిలో జరగనుంది. ఈ నెల 27,28,29 తేదీల్లో నిర్వహించనున్న మహానాడుకు సంబంధించిన వేదికను టీడీపీ పోలిట్ బ్యూరో కొద్దిసేపటి క్రితం ఖరారు చేసింది. నేటి ఉదయం విజయవాడలో పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. భేటీలో భాగంగా మహానాడు నిర్వహణపైనే ప్రధానంగా దృష్టి సారించిన టీడీపీ... తిరుపతి కేంద్రంగానే మూడు రోజుల పండుగను నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత రాయలసీమ ముఖద్వారం కర్నూలులో మహానాడును నిర్వహించాలని తలచినా... వసతి సౌకర్యాల లేమి నేపథ్యంలో మహానాడు వేదికను తిరుపతికి మార్చారు.

  • Loading...

More Telugu News