: మోస్ట్ డిజైరబుల్ పర్సన్స్ జాబితా... మహేశ్ కి టాలీవుడ్ లో ప్రథమ స్థానం, ఇండియాలో ఆరవ స్థానం!
ఇండియాలో మోస్ట్ డిజైరబుల్ పర్సన్స్ జాబితాను ప్రతి యేడాది మాదిరిగానే ఈ యేడాదీ టైమ్స్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. భారత సెలబ్రిటీల్లో మొత్తం 50 మందిని ఎంపిక చేసి, పాఠకులు ఎవరిని కోరుకుంటున్నారని ప్రశ్నిస్తూ, ఒక పోల్ నిర్వహించగా, టాలీవుడ్ లో ప్రథమ స్థానంలోనూ, దేశవ్యాప్తంగా ఆరవ స్థానంలో ప్రిన్స్ మహేష్ బాబు నిలిచాడు. ఈ జాబితాలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తొలి స్థానంలో నిలువగా, విరాట్ కోహ్లీ, ఫవాద్ ఖాన్, హృతిక్ రోషన్ సిద్ధార్థ మల్ హోత్రాలు టాప్ 5లో నిలిచారు. గత ఐదు సంవత్సరాల జాబితాలో టాప్-10లో ఉన్న మహేష్ బాబు, ఈ సంవత్సరం సైతం తన పాప్యులారిటీని నిలుపుకున్నాడు. బాహుబలి చిత్ర విలన్ రానా 11వ స్థానంలో, హీరో ప్రభాస్ 13వ స్థానంలో నిలిచారు. ప్రభాస్ తొలిసారిగా జాబితాలో చోటు దక్కించుకోగా, రానా తన స్థానాన్ని కొద్దిగా మెరుగుపరచుకున్నాడు. గత సంవత్సరం టాప్-10లో ఉన్న టీమిండియా కెప్టెన్ ధోనీ, ఈ సంవత్సరం 14వ స్థానానికి జారిపోయాడు.