: ఈనెల 16, 17, 18 తేదీల్లో కర్నూలులో వైసీపీ ధర్నా చేసితీరుతుంది: వైసీపీ నేత భూమన
ప్రజా సమస్యలపై తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పోరాటం కొనసాగిస్తూనే ఉంటారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 16, 17, 18 తేదీల్లో కర్నూలులో వైసీపీ ధర్నా చేసితీరుతుందని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటంలో వైసీపీ వెనక్కితగ్గదన్నారు. వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై గళం విప్పుతోన్న కారణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు మేల్కొంటున్నారని అన్నారు. అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న ప్రాజెక్టులపై ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రజల కోసం పోరాడతామని వ్యాఖ్యానించారు. టీడీపీ చేస్తోన్న ఎమ్మెల్యేల కొనుగోలుతో వైసీపీ బలహీనపడదని ఉద్ఘాటించారు.