: కాస్తంత ఊరట... రుణాలపై వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గించిన ఎస్బీఐ
ఇండియాలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుగా సేవలందిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ రకాల రుణాలను తీసుకుని నెలవారీ కిస్తీలు చెల్లిస్తున్న వారికి కాస్తంత ఊరట లభించింది. వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గిస్తున్నట్టు బ్యాంకు ప్రకటించింది. ప్రస్తుతమున్న ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నామని, ఈ నిర్ణయం 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్టని తెలిపింది. ఈ మార్పు అనంతరం మహిళా రుణగ్రస్తులకు 9.35 శాతం, పురుషులకు 9.40 శాతం వడ్డీ రేటుపై రుణాలు లభించనున్నాయి. రుణాలు తీసుకున్న కస్టమర్లకూ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి.