: మిగిలిన వైకాపా ఎమ్మెల్యేలూ టీడీపీలోకి: శిల్పా చక్రపాణి రెడ్డి


వైకాపాలో మిగిలివున్న కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని శిల్పా చక్రపాణి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విజయవాడలో చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే వైకాపా పూర్తిగా ఖాళీ అవుతుందని విమర్శించారు. పార్టీపై జగన్ పట్టును కోల్పోయారని అన్నారు. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం నేతల మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగిందని, ఇక అభివృద్ధి పథంలో జిల్లా దూసుకెళుతుందని జిల్లా ఇన్ చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News