: చంద్రబాబు మాట వేదవాక్కే... ఇక భూమాతో కలిసిపోతాం: శిల్పా


నిన్నటి వరకూ వేర్వేరు పార్టీలలో ఉండి, నేడు ఒకే పార్టీలో పనిచేస్తూ, బద్ధ శత్రువులుగా బయటకు కనిపించిన కర్నూలు జిల్లా నేతలు, ఇక విభేదాలకు పుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారు. ఈ ఉదయం చంద్రబాబుతో భేటీ అనంతరం శిల్పా సోదరులు చక్రపాణి రెడ్డి, మోహన్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. తమకు అధినేత చంద్రబాబు మాట వేదవాక్కని, ఆయన చెప్పిన సూచనలను తు.చ. తప్పక పాటిస్తామని తెలిపారు. కార్యకర్తలు, నేతలు బాగుంటేనే పార్టీకి మేలని సీఎం అన్నట్టు వెల్లడించిన శిల్పా మోహన్ రెడ్డి, ఇకపై భూమాతో విభేదాలకు తావివ్వకుండా నడుస్తామని తెలిపారు. రెండు వర్గాలూ మనస్ఫూర్తిగా కలవాలని ఆయనిచ్చిన పిలుపునకు తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు.

  • Loading...

More Telugu News