: బాలీవుడ్ లో తెలుగు ఇండస్ట్రీ పరువు తీసిన సర్దార్ గబ్బర్ సింగ్: వర్మ ట్వీట్


ఎల్లప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేసి అటు అభిమానులు, ఇటు విమర్శకుల నోళ్లల్లో నానుతుండే, రాంగోపాల్ వర్మ మరోసారి అదే శైలిలో స్పందించాడు. పవన్ కల్యాణ్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్, హిందీలో విడుదలైన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, బాలీవుడ్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న పరువును ఈ చిత్రం తీసిందని వ్యాఖ్యానించాడు. పోయిన పరువు రాజమౌళి వెనక్కు తీసుకువస్తాడని, బాహుబలి-2తో మూడు రెట్ల నమ్మకం పెరుగుతుందని అన్నాడు. పవన్ కొత్త సినిమా, తెలుగులో మిశ్రమ స్పందనను తెచ్చుకున్నప్పటికీ, హిందీలో ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. వర్మ తాజాగా చేసిన ఈ ట్వీట్ పై పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో?

  • Loading...

More Telugu News