: ఏపీ తరఫున ఉమాభారతి వకాల్తా!... పోలవరం ప్రాజెక్టు నిధులు కేంద్రానివేనని ప్రధానికి లేఖ
నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నవ్యాంధ్రప్రదేశ్ తరఫున బీజేపీ సీనియర్ నేత, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి వకాల్తా పుచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల పట్ల అమితాసక్తి ప్రదర్శిస్తున్న ఉమాభారతి... ఇప్పటికే పలుమార్లు ఆ రాష్ట్రాలకు అనుకూలంగా పలుమార్లు బహిరంగ ప్రకటనలు చేశారు. తాజాగా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆమె ఓ లేఖ రాశారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన ఆమె... ఆ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నిధులను కేంద్రమే విడుదల చేయాల్సి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు.. వెరసి పోలవరం ప్రాజెక్టుకు ఇతోధికంగా నిధులు కేటాయించాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పినట్టయింది.