: మీరిద్దరూ కొట్టుకుంటే పార్టీకి నష్టమే: భూమా, శిల్పాలకు చంద్రబాబు క్లాస్
కర్నూలు జిల్లా టీడీపీ నేతలు భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డిలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఉదయం సమావేశమయ్యారు. ఇద్దరు నేతలూ కలిసుండాలని క్లాస్ పీకారు. నేతలు పరస్పర విమర్శలకు దిగుతుంటే, కార్యకర్తల్లో మనోస్థైర్యం దెబ్బతింటుందని, దానివల్ల పార్టీకి నష్టమే తప్ప లాభముండదని హెచ్చరించారు. విభేదాలు లేకుండా పార్టీని నడపాలని సూచించిన ఆయన, ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమన్వయంతో పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశానికి డిప్యూటీ స్పీకర్ కేఈ కృష్ణమూర్తి, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, టీడీ జనార్దన్ లు కూడా హాజరయ్యారు.