: భూకేంద్రం మండే అగ్నిగోళమే


సూర్యుడొక్కడే అగ్నిగోళం కాదు. భూమి కూడా అలాంటి అగ్నిగోళంనుంచే ఇప్పుడున్న తీరులోకి మారిందని మనకు తెలుసు. భూమి కేంద్ర భాగానికి వెళ్లేకొద్దీ వేడిమి పెరుగుతూ ఉంటుందని కూడా తెలుసు. భూ కేంద్రంలో అయితే.. ఆ ఉష్ణోగ్రత అత్యధిక స్థాయిలో ఉంటుంది. భూకేంద్రంలో ఇనుము వంటి లోహాలన్నీ ద్రవరూపంలోనే ఉంటాయి. ఎంతోభయంకరమైన ఉష్ణోగ్రత ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. సుమారు 20 ఏళ్ల కిందట జరిగిన పరిశోధనల్లో అప్పటి శాస్త్రవేత్తలు.. భూకేంద్రంలోని ఉష్ణోగ్రత అయిదువేల డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉండవచ్చునని ప్రకటించారు.

అయితే తాజాగా యూరోపియన్‌ పరిశోధకులు ఈ విషయంలో పున: ప్రయోగాలు నిర్వహించారు. ఇనుము ఎంత పీడనం, ఎంత ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది వంటివి పరీక్షించి.. భూకేంద్రంలో ఉష్ణోగ్రత ఆరువేల డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉంటుందని లెక్క తేల్చారు. గతంలోని లెక్కల కంటె ఇది వెయ్యి డిగ్రీలు ఎక్కువ. ఫ్రెంచి నేషనల్‌ టెక్నలాజికల్‌ రీసెర్చి ఆర్గనైజేషన్‌, ఫ్రెంచి నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌, యూరోపియన్‌ సింక్రట్రాన్‌ రేడియేషన్‌ ఫెసిలిటీ శాస్త్రవేత్తలు కలిసి ఈ ప్రయోగాలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News