: మహిళా డీఎస్పీని ఫొటో తీసిన హోంగార్డు!... సస్పెండ్ చేసిన పోలీసు శాఖ


అతడో తుంటరి. తెలంగాణ పోలీసు శాఖలో ఎలాగోలా హోంగార్డు పోస్టు దక్కించుకున్నాడు. హైదరాబాదు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. పోలీసు శాఖలో చేరినా అతడి ఆకతాయి చేష్టలు మాత్రం తగ్గలేదు. కమిషనర్ కార్యాలయంలోనే అతడు సెల్ ఫోన్ చేతబట్టి సీఐడీ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న ఓ మహిళా పోలీసు అధికారి ఫొటోలు తీశాడు. అయితే ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన సదరు డీఎస్పీ వేగంగా స్పందించారు. అతడి చేతిలోని సెల్ ఫోన్ లాగేసుకున్నారు. తన ఫొటోలను అతడు తీసిన తీరును మహిళా డీఎస్పీ పరిశీలించారు. దురుద్దేశపూర్వకంగానే అతడు తన ఫొటోలు తీశాడని నిర్ధారించుకున్న ఆమె విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సాక్షాత్తు కమిషనర్ కార్యాలయంలోనే ఈ తరహా ఘటన చోటుచేసుకోవడంతో పోలీసు బాసులు అతడి చర్యను తీవ్రంగా పరిగణించారు. వెనువెంటనే అతడిని సర్వీసు నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక అతడిపై కేసు కూడా నమోదు చేశారు.

  • Loading...

More Telugu News