: బెంగళూరులో యువతిని రెండు చేతులతో ఎత్తుకెళ్లిపోయిన కామాంధుడి అరెస్ట్


బెంగళూరులో సంచలనం సృష్టించిన యువతి కిడ్నాప్, అత్యాచారయత్నం కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. ఈ కేసులో ముఖానికి ముసుగు వేసుకుని, క్యాప్ పెట్టుకుని తన బలమైన చేతులతో యువతిని ఎత్తుకెళ్లిపోతూ కనిపించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అత్యాచారయత్నం ఘటన గత నెల 23న యువతి ఉంటున్న హాస్టల్ వద్దే జరుగగా, నిన్న సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. యువతి స్వయంగా ఫిర్యాదు చేయనప్పటికీ, ఆమె ఓ స్థానిక టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడంతో, స్పందించిన కర్ణాటక మహిళా కమిషన్ చైర్ పర్సన్ మంజులా మానస ఆదేశాల మేరకు పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసి ఆ కామాంధుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News