: న్యాయ వ్యవస్థపై నోరుపారేసుకున్న మాల్యా!... ఎంపీ పదవికి రాజీనామా లేఖలో సంచలన వ్యాఖ్యలు


బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా... భారత న్యాయ వ్యవస్థను కించపరుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయనను సభ నుంచి సస్పెండ్ చేయాలని ఎథిక్స్ కమిటీ యత్నిస్తున్న నేపథ్యంలో... దీనిపై స్పష్టమైన సమాచారం అందుకున్న మాల్యా నిన్న కీలక అడుగు వేశారు. తనపై సస్పెన్షన్ వేటు పడకముందే మేల్కొన్న ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ కు ఆయన నిన్న ఓ లేఖ రాశారు. సదరు లేఖలో తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపిన మాల్యా... భారత న్యాయ వ్యవస్థపై నోరు పారేసుకున్నారు. భారత్ లో నిష్పక్షపాత విచారణ జరగదని ఆయన అందులో సంచలన వ్యాఖ్య చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత న్యాయ స్థానాల్లో తనకు న్యాయం జరగదని కూడా ఆయన ఆరోపించారు. ఈ కారణంగానే తాను ఇప్పుడప్పుడే భారత్ కు రాలేనని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News