: 'అత్తారింటికి దారేది' సినిమా కంటే ముందు నుంచీ ఈ సినిమా కథ నాకు తెలుసు!: పవన్ కల్యాణ్


నితిన్ కి తానంటే అంతిష్టమని తెలియదని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన ఈ రోజు చెప్పేంతవరకు తనకు తెలియదని ఆయన అన్నారు. నితిన్ ని మొదట చూడగానే తనకు చాలా ప్రేమగా, తన తమ్ముడిలా అనిపించాడని అందుకే నితిన్ 'ఇష్క్' సినిమా ఆడియోకు వచ్చానని అన్నారు. తనలాగే అతనికి కూడా చాలా కాలం హిట్స్ లేవని హరీష్ శంకర్ చెప్పడంతో తాను ఆ ఆడియో ఫంక్షన్ కు వచ్చానని, ఆ సినిమా యూనిట్ కష్టపడడంతో అది విజయం సాధించిందని తెలిపారు. నితిన్ మంచి నటుడిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. పేరు పేరునా ధన్యవాదాలు చెప్పడం తనకు ఇష్టం ఉండదని ఆయన అన్నారు. 'గోకులంలో సీత' సినిమాకు చాలా డైలాగులు త్రివిక్రమ్ రాశారని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అప్పటి నుంచి ఆయనతో పరిచయం, గౌరవం పెరిగాయని ఆయన అన్నారు. త్రివిక్రమ్ లాంటి రచయిత ఉన్నందుకు తెలుగు సినీ పరిశ్రమ గర్విస్తుందని ఆయన చెప్పారు. 'అత్తారింటికి దారేది' సినిమా కంటే ముందు నుంచి ఈ సినిమా కథ తనకు తెలుసని ఆయన అన్నారు. ఇదో అందమైన కథ అని ఆయన చెప్పారు. ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమకు మరో గొప్ప విజయం అందిస్తుందని ఆయన ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News