: పొద్దుట్నుంచి ఓ మంచి స్పీచ్ రాద్దామని ప్రయత్నించాను: సమంత


ఆడియో ఫంక్షన్ లో మాట్లాడాలని పొద్దుట్నుంచి ఓ మంచి స్పీచ్ రాద్దామని ఎంతో ప్రయత్నించానని సమంత తెలిపింది. శిల్పకళావేదికలో జరిగిన అ...ఆ...ఆడియో వేడుకలో ఆమె మాట్లాడుతూ, తన గురించి తాను మాట్లాడుకుంటే బాగోదని స్పీచ్ రాయడం ఆపేశానని చెప్పింది. త్రివిక్రమ్ గారితో పనిచేయడం ఇది రెండోసారి అని చెప్పిన సమంత...సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపింది. తనకు మంచి పాత్ర ఇచ్చిన ఆయనకు ధన్యవాదాలు తెలిపింది. ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన పవన్ కల్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పింది. నితిన్ తో పని చేయడం మంచి అనుభవమని పేర్కొంది.

  • Loading...

More Telugu News