: నా సక్సెస్ లో పవన్ కల్యాణ్ హస్తం ఎంతో ఉంది!: నితిన్
'అ..ఆ...సినిమా గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే...త్రివిక్రమ్ స్టైల్ లో ఇది అందమైన, ఆహ్లాదకరమైన సినిమా' అని నితిన్ చెప్పాడు. అదే సినిమా పేరును పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టైల్ లో చెప్పాలంటే 'అఆ' అంటూ పవన్ డిక్షన్ ను అనుకరిస్తూ చెప్పాడు. దీంతో వారి అభిమానులు కేరింతలు కొట్టారు. తన సినీ కెరీర్ సక్సెస్ లో పవన్ కల్యాణ్ హస్తం ఎంతో ఉందని నితిన్ తెలిపాడు. సినిమాల్లోకి రాకముందు 'జయం' ఆడిషన్స్ కి వెళ్లినప్పుడు తనను డాన్స్ చేయమంటే...తమ్ముడు సినిమాలోని రెండు స్టెప్పులు వేశానని గుర్తు చేసుకున్నాడు. 'పర్లేదు వీడి శరీరంలో మూవ్ మెంట్ ఉంద'ని దర్శకుడు తేజ భావించారని, తరువాతి రోజు యాక్షన్ సీన్ చేయమంటే అదే సినిమాలోని 'శకుంతక్యా' అంటూ పవన్ కల్యాణ్ చేసిన సీన్ చేశానని, దానిని చూసిన తేజ తనను హీరోను చేశారని చెప్పాడు. తాను పూర్తిగా ఫ్లాపుల్లో ఉండగా, ఇష్క్ సినిమా ఆడియో వేడుకకు మళ్లీ పవన్ అతిథిగా వచ్చారని, ఆ సినిమా సూపర్ హిట్టై కెరీర్ ను ఇచ్చిందని చెప్పాడు. "ఈసారి 'అ..ఆ' సినిమా ఆడియోకు మీరు అతిథిగా వచ్చారు...ఇక దీని గురించి నేను మాట్లాడేది ఏదీ లేదు" అని నితిన్ అన్నాడు. త్రివిక్రమ్ నడిచే లైబ్రరీ, వికీపీడియా, కదలాడే గూగుల్ అని తెలిపాడు.