: తెలుగులో మాట్లాడి అలరించిన నదియా
'అ..ఆ' సినిమా ఆడియో వేడుకలో 'అత్తారింటికి దారేది' ఫేమ్ నదియా తెలుగులో మాట్లాడి అభిమానులను అలరించింది. తనకు తెలుగు సరిగా రాదని, అందుకే పేపర్ పై రాసుకుని మరీ వచ్చానని చెప్పింది. త్రివిక్రమ్ సినిమాలో రెండోసారి నటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. నితిన్, సమంత అద్భుతంగా నటించారని కొనియాడింది. పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి వచ్చి వెలుగులు తెచ్చారని పేర్కొంది. మిక్కీ జే మేయర్ అందించిన స్వరాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపింది. సినిమా కథ అందర్నీ ఆకట్టుకుంటుందని నదియా ఆకాంక్షించింది. అభిమానులు చూపే ప్రేమాప్యాయతలు ఎంతో శక్తినిస్తాయని, ప్రేమాభిమానాలు అందిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.