: త్రివిక్రమ్ తో పని చేస్తే డబ్బూ వస్తుంది... మేధస్సూ పెరుగుతుంది: హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి
'అ..ఆ' ఆడియో వేడుకలో హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పని చేస్తే డబ్బులతో పాటు మేధస్సు కూడా పెరుగుతుందని అన్నాడు. త్రివిక్రమ్ పుస్తకం లాంటి వాడని శ్రీనివాస్ రెడ్డి కొనియాడాడు. ఎదురుగా పవన్ కల్యాణ్ ఉంటే మిగిలిన వారందర్నీ మర్చిపోతామని, ఎవరినైనా మర్చిపోతే తప్పుగా అనుకోవద్దని సూచించాడు. ఈ సినిమాలో నందిత దగ్గర పీఏ పాత్రలో నటించానని తెలిపాడు. సినిమా పేరు మాత్రమే 'అ..ఆ' అని సినిమాలో గుణింతాలు కూడా ఉన్నాయని శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు. సినిమా సూపర్ హిట్ అవుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపాడు.