: మోదీపై కేజ్రీ ట్వీట్.. కేజ్రీ ట్వీట్‌పై నెటిజన్ల కామెంట్
ప్రధాని నరేంద్రమోదీపై తరుచూ విమర్శల తూటాలను పేల్చే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ట్విట్టర్ ద్వారా మోదీపై చేసిన ట్వీట్ తో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కుంటున్నారు. వారణాసిలో నిన్న ఈ-బోట్స్, ఈ-రిక్షాలు ప్రారంభించిన మోదీ అనంతరం వాటిపై కాసేపు ప్రయాణించారు. అయితే వాటిపై ఓలా, రిలయన్స్ సంస్థల పోస్టర్లు ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించిన కేజ్రీవాల్... ఇది ఈ-బోట్స్, ఈ-రిక్షాలు ప్రారంభించే కార్యక్రమమా..? లేదా ఓలా, రిలయన్స్ సంస్థలకు మోదీ ఇచ్చే ప్రకటన కార్యక్రమమా..? అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌ను గమనించిన పలువురు మోదీ అభిమానులు.. కేజ్రీవాల్ చేతిలో సెల్ ఫోన్ ఉండగా గతంలో దిగిన ఓ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ అది యాపిల్ కోసం ప్రకటనా..? అని ట్వీట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగానే అభిమానులు, నేతలు.. విమర్శలు, ప్రతివిమర్శలను కొనసాగిస్తున్నారు.