: వైఎస్సార్సీపీ ఆఫీస్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం... పార్టీ నేతలు మోసం చేశారంటూ సూసైడ్ నోట్!


కడప జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం ఎదుట శరత్ చంద్ర అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కడప జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అమర్ నాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలు తనను మోసం చేశారని శరత్ చంద్ర సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. తన వద్ద నుంచి 30 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్న వీరిద్దరూ...ఆ డబ్బు చెల్లించాలని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని ఆయన సూసైడ్ నోట్ లో తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News