: రేపు ఏపీ వాదనలను సుప్రీం వింటుంది...ఈ ఏడాదికి మినహాయింపు అడుగుతాం: లక్ష్మారెడ్డి


ఎంసెట్ పరీక్షపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలను రేపు సుప్రీంకోర్టు వింటుందని తెలిసిందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కనీసం ఈ ఏడాది వరకు ఎంసెట్ కు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరుతామని అన్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సమస్యలను సానుకూలంగా అర్థం చేసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరుతామని ఆయన తెలిపారు. న్యాయస్థానం ఈ ఏడాదికి మినహాయింపునిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News