: చీమలు కుట్టడంతోనే చిన్నారి చనిపోయాడు.. రీ పోస్టు మార్టమ్ నిర్వహించాలి: బంధువుల ఆందోళన
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చీమలు కుట్టడంతో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు, వామపక్షాల ఆధ్యర్యంలో ఆందోళనకు దిగారు. వైద్యులు తమ తప్పులేదని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆందోళనలో పాల్గొంటున్న వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చీమలు కుట్టడంతోనే చిన్నారి చనిపోయాడని, రీ పోస్ట్ మార్టమ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై ప్రాథమికంగా విచారణ జరిపిస్తామని అధికారులు అంటున్నారు. ఆసుపత్రికి చేరుకున్న విజయవాడ కలెక్టర్ ఆసుపత్రి సిబ్బందిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.